అధికారుల సమక్షంలో నిజాలు తేల్చండి

పార్వతీపురం నియోజకవర్గం, పార్వతీపురం పట్టణం గత మూడు రోజులుగా టీడీపీ, వైసీపీల మధ్య విమర్శ, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి అని అందరికీ తెలిసిన విషయమే. అయితే అవి ముదిరి ఆధారాలు లేని వ్యక్తిగత విమర్శలకు దారితీస్తున్నాయి. అక్కడితో ఆగక స్థానిక కౌన్సిలర్ ఇళ్ళను ముట్టడించడం అనేది మంచి వాతావరణం కాదని ప్రెస్ ముఖంగా జనసేన నాయకులు చందక అనీల్, రెడ్డి కరుణ, రాజాన రాంబాబు, సిరిపురాపు గౌరీ, మాణేపల్లి ప్రవీణ్ రెడ్డి నాగరాజు, నడుకూరు శ్రీను తదితరులు ప్రశ్నించారు. అనంతరం జనసేనపార్టీ నాయకులు చందక అనీల్ మాట్లాడతూ ఇది మంచి వాతావరణం కాదని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత దాడులు అనేవి జనసేన తీవ్రంగా ఖండిస్తుంది అని అన్నారు. వ్యక్తిగత విషయాలపై హుషారుగా ప్రెస్ మీట్ పెట్టిన మీరు మీ కౌన్సిలర్ స్థలం కోసం దేవునిబంద మధ్యలో మట్టి రోడ్ వేసుకున్నారు దానిగురించి వివరణ ఇవ్వండి. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవడం కోసం ఇసుక వేస్తే సచివాలయం సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది రకరకాల ప్రశ్నలతో హింసిస్తారే అలాంటిది దేవుడు బంద మధ్యలో రోడ్డు వేస్తే ఏ అధికారులకు ఎందుకు కనిపించలేదు దీని వెనక ఎవరు ఉన్నారు..? అది కూడా మీరు ప్రెస్ మీట్ లో చెప్పండి అని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు కి సూటిగా ప్రశ్నించారు. ఇకనైనా ఈ వ్యక్తిగత ఆరోపణలు ఆపండి ఎలక్షన్లో ఎవరు బలం ఏంటో తేల్చుకొందాం పార్వతీపురం అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు.