బ్రహ్మసముద్రం మండల రైతులు, కూలీలతో ముఖాముఖి కార్యక్రమం

కళ్యాణదుర్గం నియోజకవర్గం, బ్రహ్మసముద్రం మండలం, బుడిమేపల్లి గ్రామంలో రైతులు, కూలీలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ & జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు లక్ష్మీనరసయ్య రాయల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు, కూలీలు కష్టాలను, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యలన్నింటినీ టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారికి తెలియజేస్తాము అని భరోసా ఇచ్చి, అందరూ అమిలినేని సురేంద్రబాబు గారికి ఓటు వేసి, గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ బాల్యం రాజేష్, జిల్లా కార్యదర్శులు లక్ష్మీనరసయ్య రాయల్ గారితో పాటు నియోజకవర్గ జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ రాయుడు, కళ్యాణదుర్గం జనసేన ముఖ్య నాయకులు రుహుల్ల, గాజులపల్లి రమేష్, రఘు, బ్రహ్మసముద్రం మండలం జనసేన పార్టీ నుండి బుడిమేపల్లి అనిల్, కె.టి. తిమ్మరాజు, కాలువ ధనుంజయ, వకీల్ రాజన్న, డి.మహేష్ పాల్గొన్నారు.