రైతు భరోసా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, కె.సావరం గ్రామంలో రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతులకు 30 కోట్ల రూపాయలతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్ ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య, జిల్లా సంయుక్త కార్యదర్శి సాదా వెంకట్ చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ కటకం రామకృష్ణ, సావరం ఎం.పి.టి. సి కాకర్ల కరుణాకర్, ఉండ్రాజవరం మండలం ప్రెసిడెంట్ వీరమళ్ల బాలాజీ, సావరం జనసేన ప్రెసిడెంట్ నార్ని రామకృష్ణ, నిడదవోలు నాయకులు ఏ. ఎన్. ఆర్ మరియు ఉండ్రాజవరం మండలం జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.