రైతుల ప్రయోజనాల కోసమే రైతు వేదికలు

రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, వారినిచైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకే తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. రైతులు తాముపండించిన ఉత్పత్తులకు సంబంధించి పరస్పరం చర్చించుకోవడం, మంచి ధరలను పొందేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు. గురువారం రఘునాధపాలెం మండల కేంద్రంలో జరుగుతున్న రైతు శిక్షణ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.

ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులు లాభదాయక పంటలను పండించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఈ శిక్షణా కార్యక్రమంలో లభిస్తాయని తెలిపారు. అనంతరం రైతువేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. రఘునాధ పాలెం మండలంలోని వేపకుం్ల చెరకు బొమ్మా తండాల్లో వైకుంఠధామం, ప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డులను కూడా మంత్రి పువ్వాడ ప్రారంభించారు.