అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి: వీరఘట్టం జనసేన

పాలకొండ, రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు ఆదేశాల మేరకు వీరఘట్టం మండలం జనసేన పార్టీ నాయకులు సతివాడ వెంకటరమణ, గర్భాపు నరేంద్ర, కర్నేని సాయి పవన్ బిటివాడ గ్రామంలో పంటలు దెబ్బతిన్నాయని, రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శనివారం వేసిన గాలి వానలో యొక్క ప్రభావంతో పంటలు నాశనం అయ్యాయని, పెట్టిన పెట్టుబడి కూడా వెనుకకు రాదని, ఇప్పటివరకు అధికారులు ఎవరూ రాలేదని, రైతులు తీవ్ర భగవద్వీకానికి గురయ్యారు. వాళ్ళ గోడును వినిపించారు. జనసేన నాయకులు సతివాడ వెంకటరమణ మాట్లాడుతూ తీవ్ర నష్టం చేకూరిందని, ఇంత విపత్తు నేపథ్యంలో ఏమాత్రం అధికారులు ఇంకా చర్యలు తీసుకొలేకపోవడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. మరియు స్థానిక ఎమ్మెల్యే కూడా కనీసం రైతుల పరామర్శించకపోవడం అన్యాయమన్నారు. వీరఘట్టం మండలం జనసేన నాయకులు గర్భాపు నరేంద్ర మాట్లాడుతూ వందలాది ఎకరాలు మండలంలో ఈ విపత్తు కారణంగా నష్టానికి గురయ్యాయని, ప్రభుత్వం అధికారి యంత్రం గాని కదిలించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే కర్నేనీ సాయి పవన్ మాట్లాడుతూ రైతుల్ని కష్టకాలంలో ఆదుకోలేని ఎడల రైతుదీక్షలకు కూడా వెనకాడబోమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.