రైతులకు పంట నష్ట పరిహారం అందించాలి: సువర్ణరాజు

గోపాలపురం నియోజకవర్గం: జనసేన ఇన్చార్జి సువర్ణరాజు సోమవారం గోపాలపురం మండలం, గంగోలు గ్రామపంచాయతీ రాంపాలెం గ్రామంలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి, రైతులని పరామర్శించారు. రైతులకి మొక్కుబడి సహాయం కాకుండా కనీసం ఎకరానికి రూ 20000/- సహాయం చెయ్యాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులని ఆదుకోవాలి అని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో గంగోలు గ్రామ కమిటీ అధ్యక్షులు గేరా ఫణీంద్ర, మందపాటి సత్యనారాయణ, పుట్టుపు రామపరమేశ్వర రావు, మందపాటి మణికంఠ, పుట్టుపు సతీశ్, పాలూరి తారక రామారావు, సేనం రాజేష్, సారేపెల్లి శ్రీను, దగ్గు వెంకటేష్, వింటి వేణుగోపాల్, జాలిపర్తిసందీప్, ముప్పిడి రాజేశ్, ఎం. సూర్య, దగ్గు వెంకనబాబు, సీలబోయన ఫణీంద్ర, సి హెచ్ శ్రీను, దేసరెడ్డి సురేంద్ర, బల్లబ్బాయ్కాలింగి సతీష్, రావూరి కృష్ణ, రాయపాటి నాగు, పలనాటి ప్రసాద్ మరియు జనసేన, తెలుగు దేశం నాయకులు పాల్గొన్నారు.