రైతులకు పగిటిపూట 9 గంటల నాణ్యమైన నిరంతర కరెంటును అందజేయాలి

  • అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: తక్షణమే రైతులకు పగిటిపూట 9 గంటల నాణ్యమైన నిరంతర కరెంటును అందజేయాలని.. “రూపాయి పావుల ప్రభుత్వాన్ని” జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జయరాం రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఎలినో ప్రభావం వలన ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం తక్కువగా నమోదయింది, మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడకపోవడం వల్ల ఇప్పటికే చెనక్కాయ, కంది, ఆముదం లాంటి పంటలు నిట్ట నిలువునా ఎండిపోయినాయి రైతులందరూ పూర్తిగా నష్టపోయినారు. అనంతపురం జిల్లాలో బోరు బావులు క్రింద టమోటా, మిరప లాంటి పంటలు సాగు చేసినారు… రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థత చేతకాని పాలన వలన రైతులకు పగటిపూట కనీసం నిరంతరంగా రెండు గంటలపాటు కరెంటును సరఫరా చేయలేకపోతున్నారు.
రాత్రిపూట ఎప్పుడు కరెంటు వస్తుందో? ఎప్పుడు పోతుందో? దిక్కుతెలని అయోమయ స్థితిలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ అరా కోరగా అప్పుడప్పుడు కరెంటు వచ్చిన నాణ్యత లోపం వల్ల… మోటర్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. రైతులకు నాణ్యతలేని కరెంటు వలన అదనపు భారం మోయవలసి వస్తావుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రైతుల పట్ల దొంగ సానుభూతి చూపిస్తూ కాలం వెళ్లబుచ్చుకుంటూ పోతావుంది. ఇప్పటికైనా చిత్తశుద్ధితో అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి రైతుల పట్ల బాధ్యతతో వ్యవహరించి నాణ్యమైన నిరంతర కరెంటును సప్లై చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు గృహాలకు విద్యుత్తు బిల్లులు ఇప్పటికే దాదాపు పది మార్లు ప్రజలకు తెలియకుండానే పెంచేసినారు, ఆచార్జీలు, ఈ ఛార్జీలు అనుకుంటా ప్రజల నడ్డి విరుస్తున్నారు. కానీ గృహాలకు కూడా విద్యుత్తు సక్రమముగా సరఫరా చేయలేని హీన దీన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సొల్లు కబుర్లు ఆపి… నిరంతర 9 గంటల నాణ్యమైన కరెంటును సరఫరా చేసి రాష్ట్ర రైతాంగాన్ని చిత్తశుద్ధితో ఆదుకోవాలని డిమాండ్ చేసారు.