చించినాడ శ్రీనివాసుకు అండగా నిలిచిన కొవ్వలి ఫౌండేషన్

నరసాపురం మిషన్ హైస్కూల్ రోడ్ లోని శ్రీనివాస కూల్ డ్రింక్స్ షాప్ లో అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో షాప్ మొత్తం దగ్ధమైపోయింది. విషయం తెలుసుకున్న కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు అగ్ని ప్రమాద భాధితులని పరామర్శించి, బాధితుడు చించినాడ శ్రీనివాసుకు కొవ్వలి ఫౌండేషన్ ట్రెజరర్ కొవ్వలి జయలక్ష్మి, నిమ్మకాయల రస్మిత 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొవ్వలి ఫాలోవర్స్, తెదేపా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.