అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తులు చేస్తే రైతులు అభివృద్ధి చెందుతారు: నల్లమల రవికుమార్

ఉమ్మడి కర్నూలు జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గంలో గల మిడుతూరు మండలంలో అలగనూరు మరియు రోళ్ళపాడు గ్రామాల వద్ద ఉన్నటువంటి అలగనూరు రిజర్వాయర్లో గత నాలుగు సంవత్సరాలుగా నీళ్లు లేవు. దీనికి కారణం రిజర్వాయర్లోని ఒక భాగంలో చీలిక ఏర్పడి నీరు బయటికి లీక్ అవ్వడం. ఆ చీలికను మరమ్మత్తులు చేయడానికి దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. పది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరమ్మత్తులు చేస్తే దాదాపుగా పదివేల ఎకరాలకు నీళ్లు అంది, రైతులు అభివృద్ధి చెంది పట్టెడు అన్నం దొరుకుతుంది. కానీ ఇలాంటివేవీ పట్టించుకోకుండా ఋషికొండ పైన 9 ఎకరాలలో 451 కోట్ల రూపాయలతో ప్యాలెస్ నిర్మించుకోవడం న్యాయమా..? ప్రజల అభివృద్ధి నిజంగా కోరుకునేవారు మీలా ఉంటారా..? నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ నాయకులకు ఇది కనపడటం లేదా. జనసేన పార్టీ తరపున నేను వెళ్లి చూడగానే కన్నీళ్లు వచ్చేసాయి. కనుక ప్రజలారా రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది అనే భావన కలిగినటువంటి పార్టీ జనసేన పార్టీ. జనసేన-తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా నందికొట్కూరు నియోజకవర్గం నుండి ఈ రిజర్వాయర్ మరమ్మత్తుల గురించి ప్రభుత్వానికి తెలియజేస్తానని అన్నారు.