తప్పుడు కేసులకు భయపడం: వినుత కోటా

  • తప్పుడు కేసులకు భయపడం, వెనకడుగు వెయ్యం! అవసరమయితే సుప్రీం కోర్టుకి అయినా వెళ్తాం!! తిరుపతి ప్రెస్స్ క్లబ్ నందు మీడియా సమావేశంలో జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా
  • రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుకు చుక్కలే
  • మాపై తప్పుడు కేసులు పెట్టిన ఏ ఒక్కరినీ వదలం, వారిని కోర్టుకి ఈడుస్తాం!

శ్రీకాళహస్తి నియోజకవర్గం: ఏర్పేడు మండలం, చిందేపల్లి మార్గాన్ని ఈసీఐఎల్ కంపెనీ ఆక్రమించుకున్న కేసులో గ్రామస్తుల వైపు నిలబడ్డ తమపై తప్పుడు కేసులు పెట్టిన పాపానికి భారత అత్యున్నత న్యాయస్థానం వరకు తాము న్యాయ పోరాటం చేశామని చివరిగా సుప్రీంకోర్టు చివరి తీర్పుతో తన తండ్రి భాస్కర్ బాబు గారికి ఊరట లభించిందని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ వినూత కోటా, భర్త కోట చంద్రబాబు ఆమె తల్లిదండ్రులతో కలసి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో సమావేశంలో తెలిపారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కేవలం రాజకీయ కక్షలతోనే జనసేన పార్టీలో తాము కొనసాగుతున్నామని తమతో పాటు కుటుంబ సభ్యులపై పోలీస్ అధికారులను ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి సునకానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి తమ క్లినిక్ లో పనిచేసే మహిళలను సైతం 2,3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారని ఆరోపించారు. తమపై తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్క పోలీస్ అధికారి పైన రిటర్న్ కేసులు వేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే పథకం ప్రకారం సీఐ దగ్గర కంప్లైంట్ ఇప్పించి అందులో 307, ఎస్సీ /ఎస్టీ సెక్షన్లు వచ్చేట్టు తప్పుడు ఆరోపణలు పెట్టీ ముందస్తు బెయిలు రానివ్వకుండా హై కోర్ట్ లో పి.పి.ఈ ద్వారా అడ్డుకున్నారని 3 సార్లు హై కోర్టు నందు వారి తండ్రికి బెయిలు కు అడ్డుపడ్డారని. చివరకి సుప్రీం కోర్టులో 34124/2023 ఆర్డర్ ద్వారా బెయిలు మంజూరు అయ్యిందని తెలిపారు. ఒక పక్క తన భర్త కోటా చంద్రబాబు గారిని అక్రమంగా విజయవాడ నుండి ముందస్తు పథకంతో అరెస్టు చేసి 14 రోజులు జైలులో పెట్టారు, తన తల్లదండ్రుల్ని సైతం కేసులు పెట్టీ 5 నెలలు ఊరిలో లేకుండ చేసి ఆరోగ్య పరంగా, మానసికంగా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. రానున్నది జనసేన ప్రభుత్వం అని తమను ఇబ్బంది పెట్టిన దుర్మార్గులను ఎవరిని విడిచి పెట్టేది లేదనన్నారు. భాస్కర్ బాబు ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడుతూ నీ లాంటి చిల్లర రాజకీయ నాయకులను నా అనుభవంలో చాలా మందిని చూశానని, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఇంకా బలంగా పనిచేసి నీ ఓటమిలో నా సత్తా ఎంటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కేసు విషయంలో అన్ని విధాలా అండగా ఉన్న పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఎప్పటికప్పుడు సుప్రీం కోర్టు వరకు పర్యవేక్షించిన పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు.