జనసేనాని స్ఫూర్తితో అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి ఆర్థిక సహాయం

  • ఎన్నారైల సేవలు ఆదర్శం
  • జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర
  • ఛలో మచిలీపట్నం పోస్టర్ ఆవిష్కరణ

రైల్వేకోడూరు: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుకు పోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదర్శాలను తీసుకొని అనారోగ్యంతో ఉండే యువకుడికి ఆర్థిక సాయం చేయడం అభినందనీయమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర అన్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లా తిమ్మాయపాలెంలో అనారోగ్యంతో ఉన్న అరిసె వేణు గోపాల్ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఎన్నారైలు సాయంగా అందించిన 35 వేల రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ జనసేన పార్టీలో తిమ్మాయపాలెంలో జనసైనికులు నిర్వహించిన కార్యక్రమాలు ఎక్కడా నిర్వహించలేదన్నారు. అందుకే ఆ గ్రామాన్ని తిమ్మాయపాలెం కాకుండా జనసేన తిమ్మాయపాలెం అని పిలవాలి అన్నారు. పదివేల రూపాయలు సాయం చేసి పది లక్షల రూపాయల ప్రచారం చేసుకునేవారు ఉన్న ఈ రోజుల్లో చేసిన సాయాన్ని అక్కడే మరిచిపోయే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందరికో ఆదర్శం అవుతున్నారన్నారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేసిన వారే నిజమైన జనసైనికులు అని కొనియాడారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశమైన కువైట్ నుంచి అరిసె వేణుగోపాల్ ఆరోగ్యం కోసం ఆర్థిక సాయం చేయడానికి కృషి చేసిన తిమ్మాయపాలెం వాసులైన పురం సురేష్, మోడం చిరంజీవి, సాంబయ్య గారి నరసింహులు, గుంటిపల్లి గురేష్, శివకుమార్, సుంకర నవీన్, మోపూరు ప్రకాష్, ముత్యాల మహేష్, సింగర నరేష్, సింగర శశికరణ్, మోడెం మోహన్, పురం అంజి, సుంకర మహేష్ లను ఆయన అభినందించారు. ఇదే సందర్భంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన చలో మచిలీపట్నంపోస్టర్ ను జనసేన నాయకులతో కలిసి నాగేంద్ర ఆవిష్కరించారు. నియోజకవర్గం నుంచి జన సైనికులకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి సభకు తీసుకెళ్లి క్షేమంగా ఇంటికి తీసుకువచ్చి వదులుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు జోగినేని మణి, మాదాసు నరసింహ, ముత్యాల కిషోర్, నగిరిపాటి మహేష్, మాదాసు శివ, అంకిశెట్టి శివ, తుపాకుల పెంచలయ్య, పగడాల శివ, సింగర నరసరామయ్య, పురం రమణయ్య, పురం గిరి, పురం గోపాల్, పురం సుబ్బయ్య, ముత్యాల మహేష్, పగడాల శివ, ఆనందలతేజ, ఉమ్మడిసెట్టీ హర్ష, సువ్వారపు హరిప్రసాద్, నల్లంశెట్టి యానాదయ్య, పసల శివ, సాయం శ్రీధర్, కడుమురి సుబ్రమణ్యం, రెడ్డిమణి,రాజ్ కుమార్ బొమ్మనబోయిన, మని ఎమిక, ఉత్తరాది శివ, పగడాల మని, శ్రీకరపు ప్రకాష్, సవరం సాయి, పిడుగు సురేష్, సింగర విశ్వనాథ్, హరీష్, నల్లంశెట్టి కిషోర్, సాంబయ్యగరి సుబ్బనరసయ్య, తదితరులు పాల్గొన్నారు.