నాదెండ్ల మనోహర్ ప్రతీ జనసైనికుడికీ ఒక స్పూర్తి: శివదత్ బోడపాటి

  • రాజకీయ యుద్ద వీరుడు మనోహర్ అడుగుజాడల్లో జనసేన గెలుపు ఖచ్చితంగా సాధ్యం
  • నిస్వార్థ ప్రజా పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ కు తోడుగా నిస్వార్థ రాజకీయ యుద్ద వీరుడు మనోహర్ అడుగుజాడల్లో జనసేన పార్టీ గెలుపు ఖచ్చితంగా సాధిస్తుంది

విజయనగరం: విజయనగరం పర్యటనలో బాగంగా పీఏసీ ఛైర్మెన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన పాయకరావుపేట జనసేన స్టేట్ సెక్రటరీ శివదత్ బోడపాటి మాట్లాడుతూ.. ఒకే రోజులో విజయనగరం జిల్లాలో రెండు నియోజకవర్గాల సమీక్ష, శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల గ్రామాల పర్యటన, కళింగపట్నం క్రియాశీల కార్యకర్త కుటుంబానికి 5 లక్షల భీమా చెక్ పంపిణీ.. ఈ రెండు కార్యక్రమాల కోసం సుమారు 250 కిలోమీటర్ల ప్రయాణం చేసి నిరంతరామంగా 12 గంటల పాటూ జనసేన కోసం పని చేసిన తరువాత కూడా పార్టీ కోసం కష్టపడ్డ వారందరి కోసం మరో రెండు గంటల విలువైన సమయాన్ని కేటాయించి.. పవన్ కళ్యాణ్ గారి పోరాటం కోసం ముఖ్యమైన సూచనలు చేస్తూ అర్ధరాత్రి 11:30 సమయంలో కూడా అలుపు లేకుండా చిరునవ్వుతో ఉన్న మా అన్నయ్య శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్రంలో నాలాంటి ప్రతీ జనసైనికుడికి ఒక స్పూర్తి. నిస్వార్థ ప్రజా పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా నిస్వార్థ రాజకీయ యుద్ద వీరుడు మనోహర్ గారి అడుగుజాడల్లో జనసేన పార్టీ గెలుపు ఖచ్చితంగా సాధిస్తుందని శివదత్ బోడపాటి తెలియజేసారు.