జనసైనికునికి ఆర్ధికసాయం

ఆచంట నియోజకవర్గం, ఆచంట మండలం, పాలమూరు గ్రామానికి చెందిన జనసైనికుడు పంచదార రాజుకి కొన్నిరోజుల క్రితం జరిగిన రోడ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఐసీయూలో ప్రాణాపాయ పరిస్థితిలో ఉండడం జరిగింది. నేటికి రూపాయలు 4,50,000/- ఖర్చు చేశారు కానీ ఇంకా 75 వేలు ఆపరేషన్ చేయడానికి దాతల సహకారం కోరుతుండడంతో వీరికి పాలమూరు గ్రామానికి చెందిన పంచదార రాంబాబు సౌదీలో ఉంటూ తాపీ పని చేస్తున్న తోటి మేస్త్రుల ద్వారా కూర్చిన 13 వేల రూపాయలు రాజోలు జనసేన నాయకులు పంచదార చినబాబు చేతులు మీదుగా అందించడం జరిగింది.