కె.చిదంబరంను కలిసి ధన్యవాదాలు తెలిపిన ఇప్పటం జనసైనికులు

  • సాటి న్యాయవాదిగా చిదంబరంకు ధన్యవాదాలు తెలుపుతున్నాను: గాదె

మంగళగిరి, అధికార పార్టీ వారు ఇప్పటం గ్రామంలో అన్యాయంగా జరిపిన కక్ష సాధింపు చర్యలో భాగంగా రోడ్డు విస్తరణ అనే నెపంతో గ్రామంలో ఇళ్ళని కూల్చివేయటంపై హైకోర్టు సీనియర్ న్యాయవాది కె.చిదంబరం ఈ కేసుని హైకోర్టులో లంచ్ మోషన్ లో పిటిషన్ మూవ్ చేసి స్టే తీసుకోవటం జరిగింది. ఈ విషయంపై ఇప్పటం గ్రామ ప్రజల ఆనందానికి ముఖ్య భూమిక పోషించినందుకు ఇప్పటం గ్రామ ప్రజలు వీరిని మర్యాదపూర్వకంగా కలసి దుశ్శాలువాతో సత్కరించి సన్మానం చేసి వారి ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది.