పవన్ కళ్యాణ్ అభిమాని కుటుంబానికి ఆర్ధిక సహాయం

  • ప్రతి జనసైనికుడికి ఆపదలో అండగా జనసేన పార్టీ మరియు జనసైనికులు సాయంగా నిలుస్తారు
  • వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు

వనపర్తి: వనపర్తి మండలంలోని నాచహాళ్లి గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని ఆవుల శేఖర్ తండ్రి గోపాల్ అనారోగ్యానికి గురికావడంతో వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందులను తెలుసుకొని జనసేన యూత్ ఆధ్వర్యంలో రూ.8వేల ఆర్థికసాయం అందజేసినట్లు జనసేన పార్టీ వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు తెలిపారు. వారి కుటుంబానికి సాయంగా ముందుకు వచ్చిన జనసేన యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి జనసైనికుడికి ఆపదలో అండగా జనసేన పార్టీ మరియు జన సైనికులు సాయంగా నిలుస్తారనీ అలాగే నాచహాళ్లి శేఖర్ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ చేయాలనే భావనతో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు కట్టుబడి వుంటాడు అని అతనికి భవిష్యత్ లో కూడా ఎదుగుదలకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన వనపర్తి జిల్లా నాయకులు ఉత్తేజ్, సోషల్ మీడియా కన్వీనర్ హేమవర్ధన్, రుక్మెందర్, శివ కుమార్, రామాంజనేయులు, గణేశ్ యాదవ్, బాలకృష్ణ, అభిషేక్, శివప్రసాద్, పులెందర్ పాల్గొన్నారు.