పవన్ పై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: మనుబోలు శ్రీనివాసరావు

ఏ. కొండూరు: తిరువూరు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా గ్రామ గ్రామానికి జనసేన జెండా కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామీణ యువతను చైతన్య పరుస్తున్న తిరువూరు నియోజకవర్గం సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు గ్రామ గ్రామానికి జెండా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి మండలంలోని కేశ్యా, గ్యామ తండా, ఏ కొండూరు, అట్ల ప్రగడ రేపూడి గ్రామాల్లో పర్యటించిన సమన్వయకర్త శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగత దూషనలకు పాల్పడుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు చేస్తామని, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని, సంపూర్ణ మద్యపానం నిషేధించిన తర్వాతే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని ఆనాడు ఊరు తిరుగుతూ ముద్దులు, గుద్దులతో హామీలు ఇచ్చారని, ఆ హామీలు నెరవేర్చ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదని రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లు దాటిపోయిందని అన్నారు. రైతు భరోసా కేంద్రాల నిర్మాణం పేరుతో కేంద్ర నుంచి 2,300 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వాటిని దారి మళ్ళించారని, నామమాత్రంగా రైతు భరోసా కేంద్రాలను చాలా చోట్ల అద్దె గృహాల్లో నిర్వహిస్తున్నారని వాటికి అద్దెకట్టే పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదని వీటన్నిటినుంచి దృష్టి మళ్లించడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తున్నారని ఆయన అన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసైనికులు ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ మండల నాయకులతో కలిసి గ్రామాలలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ఇంటింటికి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని మండల కార్యవర్గ సభ్యులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా చేపట్టబోయే ఉమ్మడి కార్యక్రమాల్లో గ్రామ గ్రామాన జనసేన పార్టీ భాగస్వామ్యం ఉండాలని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపే లక్ష్యంతోనే ప్రతి ఒక్కరూ పనిచేయాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ నాయకులు ఉయ్యూరు జయప్రకాష్, తిరువూరు మండల అధ్యక్షుడు పర్సా పుల్లారావు, ఏ కొండూరు మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి సతీష్, ముదిగండ్ల సాయి కృష్ణ, వెంపాటి యేసయ్య, గూడవల్లి నరసింహారావు, భూక్యా వెంకటేశ్వరరావు, రవి, లక్ష్మణ్ రాథోడ్, బానోతు రఘు, తరుణ్, చిన్న బాబు, చిట్టి బాబు, వెంకటేశ్వరరావు, పెద్ద ఎత్తున యువత జనసైనికులు పాల్గొన్నారు.