అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం

శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ప్రముఖ అన్నపూర్ణ స్టూడియో లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరకొని మంటల్ని ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమి జరగకపోగా, ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని స్టూడియో మేనేజర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

అయితే అన్నపూర్ణ స్టూడియోలో ఇలాంటి ప్రమాదాలు జరగడం మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అనేక రకాలుగా ఆస్తి నష్టం కూడా జరిగింది. అప్పట్లో కొన్ని ఘటనల వెనుక అనుమానాలు కూడా వచ్చాయి. ఇక బిగ్ బాస్ హౌజ్ కూడా ఘటన జరిగిన సమీపంలోనే అంది. అయితే బిగ్ బాస్ హౌజ్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని కూడా నిర్వాహకులు తెలిపారు.

రెండేళ్ల క్రితం మనం సినిమా కోసం నిర్మించిన సెట్ కూడా షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పూర్తిగా కాలిపోయిoది. అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో అక్కడే ఎక్కువగా ఉండేవారు. అయితే ఆ సెట్ ని అలాగే నాన్న గారి గుర్తుగా ఉంచుకోవాలని అనుకున్నారు నాగార్జున. కానీ అనుకోకుండా ప్రమాదానికి గురవ్వడంతో సెట్ పూర్తిగా బుడిదయ్యింది. ఇక ఇప్పుడు మరో ప్రమాదం చోటు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.