అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి.. జనసేన డిమాండ్

పెనుగంచిప్రోలు మండలం, పెనుగంచిప్రోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న బొమ్మల దుకాణాలు మరియు గాజుల షాపులు మరియు పూజ సామాగ్రి దుకాణాలలో అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగి పూర్తిస్థాయిలో దాదాపు 20 దుకాణాల్లో మంటలు చెలరేగి దుకాణాలు పూర్తి స్థాయిలో దగ్ధం అయ్యిపోవడం జరిగింది. ఈ సంఘటన సంబందించిన బాధితులను పెనుగంచిప్రోలు జనసేన నాయకులు పరామర్శించి తక్షణ సాయంగా లక్ష రూపాయలు ప్రకటించాలని ప్రభుత్వం నుంచి 4 లక్షల రూపాయలు ప్రకటించాలని జనసేన పార్టీ తరపున దేవాలయ కార్యనిర్వాహణ అధికారితో మరియు చైర్మన్ తో మాట్లాడి వారిని తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిస మురళీకృష్ణ, మండల అధ్యక్షులు తునికి శివ, ఉపాధ్యక్షులు తన్నీరు గోపీనాథ్, ఉదయ్, గోపి, చందు, నవీను, గద్ద గోపి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.