సోహైల్ హీరోగా ఫస్ట్ లుక్ పోస్టర్

బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ గెలవక పోయినా అంతకు మించి గుర్తింపు తెచ్చుకున్నాడు సయ్యద్ సోహెల్. సోహైల్ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. హోళీ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో సోహెల్ కు జోడిగా తెలుగమ్మాయి రూపను ఎంపిక చేశారు. విజయవాడకు చెందిన రూప కొడువాయుర్ కొన్ని సినిమాల్లో నటించిన సత్యదేవ్ తో నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు సోహెల్ తో కలిసి స్క్రీన్ పై సందడి చేయనుంది. వీరిద్దరితో విడుదల చేసిన హోళీ పోస్టర్ కలర్ ఫుల్ గా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది చివరలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.