జనసేన పార్టీలో చేరిన మత్స్యకార, బీసీ యువత

ఉమ్మడి గుంటూరు జిల్లా, రేపల్లె పట్టణ అధ్యక్షుడు రాసంశెట్టి మహేష్, రేపల్లి రూరల్ మండల అధ్యక్షులు జానకయ్య, నిజాంపట్నం మండల ఉపాధ్యక్షులు అరసుమల్లి పూర్ణ, జగదీష్ ఆధ్వర్యంలో సోమవారం జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో మత్స్యకార యువత మరియు ఇతర బీసీ కులాల యువత పార్టీ లోకి చేరడం జరిగింది. వీరి అందరినీ జిల్లా అధ్యక్షులు గాదె పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. గతంలో వీరందరూ అధికార ప్రభుత్వంలో పనిచేసే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చేరటం జరిగింది. వీరిలో కన్నా శివ నాగరాజు నిజాంపట్నం మండలం తాల్లతిప్పా గ్రామ వాలంటరీగా గతంలో ఈ ప్రభుత్వంలో పనిచేసి ప్రభుత్వ విధానాలు నచ్చక రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈరోజు పార్టీలో చేరడమైనది. జనసేన పార్టీని నమ్మి ఇంత పెద్ద యువత ఈరోజు పార్టీలో చేరడం చాలా ఆనందకరమని భవిష్యత్తులో వీరందరికీ పార్టీ తరపున మంచి గుర్తింపు వస్తుందని అలాగే వీరందరి సహాయ సహకారాలతో రేపల్లె నియోజకవర్గంలో అధికార పార్టీని 2024లో జరిగే ఎలక్షన్లో ఓడిస్తామని చెప్పారు. ఈ రోజు పార్టీలోకి చేరిన వారు మోపిదేవి శివనాగరజు అతని అనుచరులు, కోక్కిలగడ్డ పవన్ కళ్యాణ్, వంశీ కృష్ణ అతని అనుచరులు మరియు కార్యక్రమంలో పాల్గొన్నవారు రేపల్లె నాయకులు కోనపరెడ్డి జగదీష్, దేవగిరి శంకర్, మిరియాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.