జనసేన ఆధ్వర్యంలో మత్స్యకారుల భరోసా యాత్ర

కాకినాడ సిటీ, జనసేన పార్టీ కాకినాడ సిటీలో శుక్రవారం సాయంత్రం 8వ వార్డులో డి.సూరిబాబు ఆధ్వర్యంలో కొత్త కాకినాడ దుర్గమ్మ గుడి ప్రాంతంలో, 14వ వార్డులో ఓలేటి నూకరాజు, పాలెపు నూకరాజు ఆధ్వర్యంలో భాగితమ్మ గుడి ప్రాంతంలో, 15 వ వార్డులో కర్రి స్వామి, పి.ఆదినారాయణ ఆధ్వర్యంలో ఏటిమొగ కొండబాబు కాలనీ, 37వ వార్డులో ఓలేటి భారతి ఆధ్వర్యంలో ఫ్రేజర్ పేట ధనమ్మ గుడి మొదలగు ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశ స్పూర్తితో, కాకినాడ సిటి ఇంచార్జ్ మరియు పి.ఏ.సి మెంబర్ ముత్తా శశిధర్ ఆలోచనల మేరకు “మత్స్యకారుల భరోసా యాత్ర” కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తమ పార్టీ తరపున పవన్ కళ్యాణ్ తమ జనసేన పార్టీ మేనిఫెస్టోలో  ప్రకటించిన “మత్స్యకారులకు సంవత్సరానికి 300 ల రోజులు పని ఉండేలా చేయడం” మరియు “వేటలేని సమయంలో ఆర్ధికంగా ఇబ్బంది పడే కుటుంబాలకు రోజుకి రూ. 500/-ల పరిహారం అందించడం” అన్న ప్రణాళికని జగన్నధపురంలోని వివిధ ప్రాంతాలలో  ఇంటి ఇంటికీ తిరిగి మత్స్యకార కుటుంబాలకు తెలియచేసారు. ఈ కార్యక్రమాలలో నగర అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, సమ్యుక్త కార్యదర్శి బడే కృష్ణ, మత్స్యకార నాయకులు మడ్డు విజయ్ కుమార్, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.