ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఆవిష్కరణ… నిరాడంబరంగా వేడుకలు

కరోనా వైరస్  కారణంగా 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా 30 వేల మందితో నిర్వహించే సంబరం 4 వేల మందికి కుదించారు. అలాగే 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొనబొతున్నారు. ఈ సారి విద్యార్థులు కూడా పాల్గొనడం లేదు. కొద్ది మంది అతిథుల కోసం భౌతిక దూరంతో కుర్చీలను ఏర్పాటు చేశారు. విదేశాలకు చెందిన దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు, కరోనాను జయించిన పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులను మాత్రమే వేడుకలకు ఆహ్వానించారు.

కరోనా నేపధ్యంలో ప్రతి ఇద్దరి మధ్య రెండు యార్డుల దూరం ఉండేలా కుర్చీల ఏర్పాటు చేసినట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. కోట సమీపంలో నాలుగు టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినా తర్వాత లోపలికి అనుమతిస్తారు. అతిథులు కూడా విధిగా మాస్కులు ధరించాలని.. మాస్క్‌ తీసుకురాకుంటే వారికి అందజేసేందుకు మాస్క్‌లను కూడా అందుబాటులో ఉంచారు. శానిటైటర్లను కూడా ఉన్నాయని తెలిపారు.

సమాచారం ప్రకారం ప్రధాని మోదీ ఉదయం 7.21 గంటలకు ఎర్రకోటకు చేరుకుంటారు. ఉదయం 7.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా వైరస్, చైనా, వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్ తదితర కీలక అంశాలపై మోడీ ప్రసంగించనున్నారు.