హేతుబద్ధమైన పరిహారమిచ్చి వరద బాధితులను ఆదుకోవాలి: కందుల దుర్గేష్

రాజమండ్రి: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి,
నామ మాత్రపు వరద సాయం, రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాజమండ్రిలో సోమవారం జనసేన పార్టీ నేతలతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ మంచి పరిపాలకుడు అంటే ప్రమాదం వచ్చిన తర్వాత పరామర్శించడం కాదు. ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ప్రజలను కాపాడుకోవడమే సుపరిపాలకుడి లక్షణం. గోదావరి వరద బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గోదావరి నదికి వస్తున్న భారీ వరదలు అప్రమత్తత లోపించడం వల్ల ప్రజలను నిలువునా ముంచేశారు. గోదావరి వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం బాధ్యతను విస్మరించింది. కేవలం బాధిత కుటుంబాలకు 2000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూసింది. ఇదే వైసీపీ నేతలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, గోదావరికి వరదలు వస్తే బాధితులకు 25 వేల రూపాయల తక్షణ సాయం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బాధితులకు రూ.2 వేలు ఇచ్చి సరిపెడుతున్నారు.

ఈ కార్యక్రమంలో రాజానగరం ఇంచార్జ్ మేడా గురుదత్ ప్రసాద్, అనపర్తి నియోజకవర్గ ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, శ్రీరాజమండ్రి సిటీ ఇంచార్జి అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షులు వై.శ్రీనివాస్, రాష్ట్ర వీరమహిళ సెక్రటరీ శ్రీమతి ఘంటా స్వరూప, జిల్లా అధికార ప్రతినిధి శ్రీ యామన నారాయణ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు జామి సత్యనారాయణ, తేజోమూర్తుల నరసింహ మూర్తి, నగర ఉపాధ్యక్షులు దాసరి గుర్నాదం తదితరులు పాల్గొన్నారు.