మూలగుంటపాడు గ్రామ అభివృద్ధిపై దృష్టి పెట్టండి: జనసేన డిమాండ్

  • సింగరాయకొండ, మూలగుంటపాడు గ్రామపంచాయతీ నీ బ్రష్టు పట్టిస్తున్న పంచాయతీ కార్యదర్శి, పట్టించుకోని సర్పంచ్ డాక్టర్ శివరామిరెడ్డి

కొండెపి నియోజక వర్గం: మూలగుంటపాడు గ్రామపంచాయతీలో సుమారు పది రోజుల క్రితం పారిశుధ్యం పై కార్యదర్శి కి ఫోటోలు ద్వారా సమస్యలు తెలియపరచినప్పటికి కూడా నామమాత్రంగానే చేసి చేతులు దులుపుకున్న పంచాయతీ కార్యదర్శి నజీర్, మూలుగుంటపాడు గ్రామ అభివృద్ధి పట్టని గ్రామ సర్పంచ్ డాక్టర్ శివరామ రెడ్డి మూలగుండపాడు గ్రామ ప్రజలు డాక్టర్ శివరాంరెడ్డి ని గ్రామ ప్రజలు అభివృద్ధి పథంలో నడిపిస్తారని నమ్మి, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మూలగుంటపాడు గ్రామమును అపరిశుబ్రానికి కేరాఫ్ గా నిలిపిన ఘనత సర్పంచ్ గారిదే అని స్థానికులు జనసేన పార్టీ వద్ద వారి ఆవేదన వ్యక్తం చేసినారు. గతంలో సాగర్ నీరు క్రమం తప్పకుండా రెండు రోజులకు ఒకసారి వస్తే ఈ వైసిపి ప్రభుత్వం ఉప్పు నీరు ఇస్తున్నారు. అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియక రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కనీసం డ్రైనేజీలు లేకపోవడం, కరెంటు స్తంభాలు లేని చోట కరెంటు స్తంభాలు వేయకపోవటం, పారిశుధ్యం కూడా గ్రామంలో లేకపోవడం.. అక్కడక్కడ కొన్నిచోట్ల నామమాత్రంగా చెత్తను తీసి ఫోటోలు పెట్టి ప్రజలను మభ్యపెట్టడం సరికాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీనిపై వెంటనే విచారణ చేసి మూలగుంటపాడు గ్రామ అభివృద్ధిపై దృష్టి పెట్టవలెనని.. అదేవిధంగా చూడ చక్కని గ్రామము అనే బోర్డుని తొలగించి అపరిశుభ్రం… డ్రైనేజీలు లేని గ్రామం అనే బోర్డు పెడితే బాగుండును అని మూలగుంటపాడు గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. దీనిపై వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ అధికారి పై చర్యలు చేపట్టివలెను అని పై అధికారులకు జనసేన పార్టీ నుండి తెలియజేయడం జరిగింది. లేని పక్షంలో ములగుంటపాడు గ్రామ పంచాయతీని ముట్టడించి పరిష్కారం అయ్యే వరకు కూడా వెనకాడ బోమని జనసేన పార్టీ నుండి హెచ్చరించడం జరిగింది.