త్వరలో “జనసేన పార్టీ” మండల కమిటీల ఏర్పాటు: తాతంశెట్టి నాగేంద్ర

రైల్వే కోడూరు: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ తో రైల్వే కోడూరు నియోజక వర్గ సీనియర్ నాయకులు శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో కలిసి నియోజక వర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు.. ముఖ్యంగా నియోజక వర్గం పార్టీ పటిష్టత, భారీ చేరికలు, కమిటీలు తదితర అంశాలమీద ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రతి అంశము క్షుణ్ణంగా పరిశీలించి పీఏసీ ఛైర్మెన్ మనోహర్ దిశా, నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ.. రైల్వే కోడూరు నియోజక వర్గంలో అందరము కలిసి కట్టుగా పనిచేసి జనసేనజెండా ఎగురేస్తామని, విజయం సాధించి అద్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఈ స్థానాన్ని బహుమతిగా అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే అతి త్వరలో మండల, గ్రామ, బూతు కమిటీలు వేసి ఎన్నికలకు సిద్దమవు తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తాతంశెట్టి నాగేంద్రతో పాటు సీనియర్ నాయకులు జోగినేని మణి, పగడాల వెంకటేష్, నల్లంశెట్టి యానాదయ్య, గంధం శెట్టి దినకర్ బాబు, ఆలం రమేష్, వరికూటి నాగరాజ, మదాసు నరసింహ, జిలకర మురళి రాయల్, పసుపులేటి రమణ తదితరులు పాల్గొన్నారు.