గిరిజన గ్రామంలో గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకలు

పాలకొండ నియోజకవర్గం: భామిని మండలం, గిరిజన గ్రామం మనుమకొండ గ్రామంలో తెలుగు వ్యావహారిక భాష పితామహుడు, సవర భాష వాగనుశాషనుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకలు జనసేన నాయకులు గిరిజన నేత, మాజీ జెడ్పీటీసీ నిమ్మల నిబ్రమ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గిడుగు రామ్మూర్తి గారి చిత్ర పటానికి నివాళులు అర్పించి, స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిమ్మల నిబ్రమ్ మాట్లాడుతూ.. గిడుగు రామమూర్తి గారు సవర భాష పాండిత్యం చెప్పిట్టిన మెదటి వ్వక్తి, సవర భాషను ప్రపంచానికి పరిచయం చేసి, ఇంగ్లీష్ లో సవర భాష వ్యాకరణాన్ని చేపట్టి, సవర భాషా అభివృద్ధి కి క్రుషి చేశారు అని, సవర కులం వాళ్ళు ఈ రోజు తెలుగు మాట్లాడం, చదవటానికి కారణం గిడుగు రామమూర్తి గారు అని, తెలుగు వ్యావహారిక భాష కృషి చేయటం కారణానికి సవర భాష నేర్చుకోవడం అని తెలియజేశారు. మనం అందరం ఈ రోజు మన గ్రామంలో ఆయన జయంతి జరుపుకోవడం మనకి గర్వకారణం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మనుమకొండ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.