వృద్ధులు, గర్భిణులకు ఉచిత క్యాబ్‌ సర్వీస్‌: మహీంద్ర లాజిస్టిక్స్‌

మందులు, ఆస్పత్రుల్లో కన్సల్టేషన్‌, టీకా, ఇతర అత్యవసర సేవలకు వెళ్లే వృద్ధులు, గర్భిణులు, డయాలిసిస్‌ రోగులకు ఉచిత క్యాబ్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు మహీంద్ర లాజిస్టిక్స్‌ సంస్థ వెల్లడించింది. సంస్థ సమకూర్చిన ఉచిత అలైట్‌ క్యాబ్‌లను శనివారం నేరేడ్‌మెట్‌ రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో మహీంద్ర లాజిస్టిక్స్‌ బిజినెస్‌ హెడ్‌ మీట్‌ గోరాడియాతో కలిసి సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ క్యాబ్‌లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా కుషాయిగూడ, ఉప్పల్‌, నేరేడ్‌మెట్‌, నాచారం, మల్కాజిగిరి ప్రాంతాలకు చెందిన వారు ఈ ఉచిత సర్వీస్‌ను వినియోగించుకోవాలంటే రాచకొండ కొవిడ్‌ కంట్రోల్‌ రూం నంబర్‌ 9490617234 ను సంప్రదించవచ్చు.