2న టీ సేవ ఆధ్వర్యంలో ఉచిత జాబ్‌మేళా

టీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న ఉచిత జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ అడప వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, ఎంబీఏ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. 2న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు టీ సేవా కేంద్రం ప్లాట్‌ 403, శ్రీనిలయం సంపూర్ణ, సూపర్‌మార్కెట్‌ లాంకో హిల్స్‌ రోడ్‌, మణికొండలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 9505800047 ఫోన్‌నెంబర్‌లో సంప్రదించవచ్చని ఆయన కోరారు.