చిత్తూరు జిల్లా జనసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

చిత్తూరు జిల్లా, జనసేన పార్టీ చిత్తూరు నియోజకవర్గ జిల్లా కార్యదర్శి దేవినేని యశ్వంత్, పూలు చందు, మురళి, సంతోష్ మరియు వెంకటేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ ముఖ్య అతిథిగా ఆహ్వానించి, వారిచేత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం బెంగళూరు లోని ప్రముఖ వైదేహి ఆసుపత్రి వారి సహకారంతో అన్ని విభాగాల నుండి పదిమంది డాక్టర్లతో తీసుకురావడం కోసం హాస్పిటల్ పిఆర్డిఓ పుంగనూరు నానబాలు లోకేష్ సహకరించారు. సుమారుగా 100 మంది ప్రజలకు షుగర్, బిపి, ఈసీజీ, ఎక్స్ రే, క్యాన్సర్ టెస్ట్స్, గుండె పరీక్షలు కీళ్ల నొప్పులు తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రతి వార్డులో నెలకు ఒకసారి జరపాలని జిల్లా అధ్యక్షులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని, జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, జిల్లా కార్యదర్శి భాను, యువ నాయకులు పార్ధు మరియు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.