జనసేన నేత నల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

డా. బి ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం: ప్రముఖ సంఘసేవకులు నల్లా శ్రీధర్ సౌజన్యంతో హైదరాబాద్ ఏషియన్ వస్క్యులర్ హాస్పిటల్ వారిచే రక్త నాళాల ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జనసేన పార్టీ నాయకులు డి.యం.ఆర్ శేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ శిబిరంలో ప్రముఖ, ప్రఖ్యాత వైద్య నిపుణులు విచ్చేసి రోగులకు ఉచితంగా పరీక్షలు జరిపారు. సుమారు 200 మంది ఈ శిబిరాన్ని సద్వినియోగ పరుచుకున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ.. కోనసీమ ప్రజలకు రక్త నాళాల సమస్యలపై అవగాహన కల్పించి, ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని మేము ముందుకు రాగానే మాకు అన్ని విధాల సహకరించిన నల్లా శ్రీధర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద వెంకట సుబ్రహ్మణ్యం (శ్రీను )కౌన్సిలర్ పడాల శ్రీదేవి నానాజీ, ఆర్.డి.యస్.ప్రసాద్, నల్లా బుజ్జి, దున్నాల బాబీ తదితరులు పాల్గొన్నారు.