తిరుపతిలో జగనన్న కాలనీలలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

తిరుపతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తిరుపతిలో జగనన్న కాలనీలను జనసేన ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగనన్న ఇండ్లు పేరుకే సెంటు, ఆ రెండు ఇండ్ల మధ్య మరలా ఒక రెండు అడుగుల సందు వదిలేశారు. ఒక కుటుంబం కాపురం ఉండాలంటే కనీసం ఒక బాత్రూమ్, వంటగది, ఒక బెడ్ రూము, ఒక హాలు ఉండాలా.? ఈ జగనన్న మోసం ఎలా ఉన్నదంటే మొత్తము ఇల్లంతా 13కు 13 అడుగులు ఉన్నాయి. మాకు తెలిసి ఇండ్లలో మనుషులు కాపురం ఉండాలా?.. మేకలు, పందులు ఉండే దానికి కూడా పనికిరావు ఈ ఇండ్లు. ఈ ఇండ్ల కోసం జగన్మోహన్ రెడ్డి ఏ ఏరియా ఎమ్మెల్యే ఉండారో ఆ ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ భూమిని ప్రైవేటు భూమిని చూపించి కొన్ని కోట్లు, ఇండ్ల జాగాలో మోసం జరిగింది. అలాగే ఈ ఇల్లు కట్టే దాంట్లో కూడా పక్కా మోసం. ఒక్క అడుగు కూడా కిందికి తవ్వకుండా గోడలు నిర్మిస్తున్నారు. నాకు తెలిసి ఈ ఇండ్ల స్థలంలోనూ ఇండ్లు కట్టే దాంట్లోనూ ఇంత పెద్ద మాఫియా ఎక్కడా జరిగి ఉండదని నేను అంచనా వేసి ఈ విషయం బయట పెడుతున్నాము. ఈ కాలనీలో మొత్తము 420 కి ఇళ్ళు కేటాయించగా ప్రజలకు వినియోగానికి ఒక్క పర్సెంట్ కూడా పనికిరాదు. మోసము జగనన్న, మోసము జగనన్న, జగమోసము జగనన్న. ఇది నీకే తగునన్నా జగనన్న అని జనసేన నాయకులు ఏద్దేవా చేసారు.