ముచ్చింద్ర గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం

ఇచ్చాపురం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం ముచ్చింద్రలో గురువారం కీ.శే శ్రీ తిప్పన భాగ్యరెడ్డి జ్ఞాపకార్థం మెడీకవర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఇచ్చాపురం మండలం ముచ్చింద్ర గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్స్ సరోజన, కల్పన సహకారంతో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. వైద్య సిబిరానికి వచ్చిన వారికి బీపీ షుగర్ ఈసిజి పరీక్షలు చేశారు. సుమారు 200 మందికి పైగా ఉచితంగా మందులు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తిప్పన చందు, నూకయ్య, ఆనంద్, హేమ, తులసి, బాపనమ్మ, ముచ్చింద్ర గ్రామ పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు.