పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, దత్తాత్రేయుడు ప్రథమవతారమైన పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆశీస్సులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న 24 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లలో జనసేన పార్టీ అభ్యర్థులు అత్యంత మెజార్టీతో ఎన్నికలలో గెలుపొందాలని కోరుకుంటూ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సూచనల మేరకు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో జరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ దంపతులచే కుటుంబ సభ్యులతో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా స్వామివారికి 1008 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి సమర్పించడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని మునుపెన్నడు ఏ నాయకుడు సాధించని విధంగా అత్యధిక మెజారిటీతో లక్ష ఓట్ల పైన గెలిపించి తీరుతామని ఎక్కడెక్కడ అయితే 24 ఎమ్మెల్యేలు 3 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారో వారు అందరు అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్కార నాయకులు కంబాల దాసు, కొలికొండ శశి యాదవ్, ఎక్స్ సర్పంచ్ గరగా సత్యనందరావు, మత్స్యకార నాయకులు పల్లెటి బాపన్న దొర, ఇంటి వీరబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జవ్వాది జోగేశ్వరరావు, ఉప సర్పంచ్ రంగనాథం నూకరాజు, దుడ్డు రాంబాబు, గేదెల వెంకటరావు, మాదేపల్లి శ్రీనివాస్, దానం లాజర్ బాబు, కంద చంద్రబాబు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు సనాపతి రాఘవ, దాసరి కిరణ్, కేతినీడి గౌరీ నాగ లక్ష్మి, మొయిళ్ళ నాగబాబు సైతన శ్రీను బాబు, పి.ఎస్.ఎన్ మూర్తి, టైల్స్ బాబి, ముప్పానా రత్నం, వినకొండ అమ్మాజీ, జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, గంజి గోవిందరావు, కారణం వీరభాస్కర్, తిరగతి పండు, చోడిశెట్టి బురయ్యాకపు, వూట బాబ్జి, పిల్లా వీరబాబు, బిజెపి నాయకులు తోట ఏడుకొండలు, మోటూరి మహేష్, వూట అనిల్ కుమార్, పేర్నిడి చక్రి, నాయుడు గోపీచంద్, బాదం చంటి గారుబండి వాసుబాబు, మచ్చా రాజుబాబు, పినక వెంకటరావు, కుంపట్ల సత్యనారాయణ, భావిరిశెట్టి రాంబాబు, వాకపల్లి సూర్య ప్రకాష్, పల్లేటి జాన్సన్, సోదే రవికిరణ్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.