ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకాలు ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు: కేసిఆర్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు వున్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రతివారికీ వాక్సినేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు రూ 2,500 కోట్ల కు పైగా ఖర్చు అవుతుందని సీఎం వెల్లడించారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని అన్నారు. తెలంగాణలో ఉన్న ఇతర రాష్ట్రాలవారికీ కూడా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు.