కాపు శంభాంలో జనసేన ఆధ్వర్యంలో ఉచిత వాటర్ ట్యాంకర్ ప్రారంభం

  • చీపురుపల్లి నియోజకవర్గంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

చీపురుపల్లి నియోజకవర్గం: విజయనగరం జిల్లాలో నే మొట్టమొదటిసారిగా చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలం, కాపు శంభం గ్రామంలో కేవలం జనసైనికులు చందక బాలకృష్ణ, బాకూరు శ్రీను తదితర ఆ గ్రామ జనసైనికులు వారి సొంత ఖర్చులతో వాటర్ ట్యాంకు ప్రారంభించడం విశేషం. జనసేనాని జన్మదిన వేడుకలు సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించి, దుమ్మేదిలో బ్లడ్ క్యాంపు, అర్తమూరులో సేవా కార్యక్రమం, బిళ్ళల వలసలో సమావేశం, కరకాం, సంకపాలెం, సింగవరం పాఠశాలలో పుస్తకాలు పంపిణీ, కెళ్లలో వాలీబాల్ పోటీలు, గరివిడి ఇంకా అనేక గ్రామంలో జనసేనాని జన్మదిన వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో పెద్ది వెంకటేష్, బోడ సింగి రామకృష్ణ, అగురు వినోద్, దన్నాన యేసు, ఎచ్చెర్ల లక్ష్మి నాయుడు, ఎడ్ల సంతోష్, జగదీష్, రామకృష్ణ, గొ గొర్ల చిన్నం నాయుడు తేగల శంకర్, విసిని గిరి శ్రీను, వీరమహిళ రౌతు కృష్ణవేణి, సాసుబిల్ రామ్ నాయుడు, గొర్ల రమణ, సింహాచలం, ధనుంజయ్, ప్రతాప్, లక్ష్మణ్ తదితర జన సైనికులు ఇంకెంతో మంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *