సభ్యత మరచిన ముఖ్యమంత్రి తీరుపై మండిపడిన గాదె

గుంటూరు: అన్నీ బంద్ లతో పకడ్బందీగా ముఖ్యమంత్రి సభానయితే పెట్టుకున్నాడు గాని.. చెప్పుకోవడానికి ఏమిలేక ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవడం మొదలు పెట్టాడు. ముఖ్యంమత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పెట్టిన కార్యక్రమానికి.. మాట్లాడిన మాటలకి ఏ మాత్రం సంబంధం ఉండదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన విలువలు పాటించకుండా మాట్లాడితే మిగతా వారు ఎలా పాటిస్తారు? రాష్ట్రంలో ముఖ్యమంత్రిది తండ్రి లాంటి పాత్ర. మరి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తే విలువలు లేకుండా మాట్లాడుతుంటే ప్రజల పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి వైఖరి ఎలాంటిదంటే ఆయన మాత్రమే ఎదుటి వారిని దూషించాలి. ఎదుటి వాళ్లు ఈయన చేసిన తప్పుని ఎత్తి చూపితే కోపం వస్తది. దాని మూర్ఖత్వం అంటారు ముఖ్యమంత్రి గారు.
పెద్దఎత్తున బస్సులు పెట్టి సభ నిర్వహించుకొవడానికి ఊరిని బంద్ ఎందుకు చెయ్యాలి? స్కూళ్ళకి ఎందుకు సెలవలు ఇవ్వాలి? ప్రభుత్వ కార్యాలయాలకి, ముఖ్యమంత్రి సభకి ఏంటి సంబంధం? వాటికీ ఎందుకు తాళాలు వేశారు? ఈ పరిస్థితి దేశంలో ఏనాడైనా ఉందా? జగనన్న ఇళ్ళ నిర్మాణం గురించి గొప్పలు పోయిన ముఖ్యమంత్రి వాస్తవానికి చెప్పినదాంట్లో ఈ 5 సంవత్సరాలలో చేసింది 25% కూడా లేదు. పోనీ చేసిన ఘనత గురించి చెప్పుకున్నాడా అంటే అది లేదు.. మైక్ పట్టుకుంది మొదలు పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చెయ్యాలి. రాజకీయ నాయకుడు అనే వాడు ఎప్పుడైనా తానూ ఎం చేసాడు, ఎం చెయ్యబోతున్నాడు అనే విషయాలు చెప్తాడు. ముఖ్యమంత్రి దీనికి పూర్తి బిన్నం. పవన్ కళ్యాణ్ గారి ఇళ్ల గురించి ముఖ్యమంత్రి మాట్లాడతాడు.. ముందు నీ ఇళ్ళు అన్ని కబ్జా ఇళ్ళు కాదా? అసలు ముఖ్యమంత్రి సభల్లో మాట్లాడే మాటలా? హోదా మర్చిపోయి మాట్లాడితే మేము కూడా మీ ఇళ్లల్లో వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారు. సంస్కారం అనేది మాలో ఉంది కాబట్టే ఇన్నాళ్లు రాజకీయ విమర్శలకె పరిమితమయి ఉన్నాము. మేము మాట్లాడడం మొదలుపెడితే మీకన్నా దిగజారి మాట్లాడగలం.. కేవలం విలువలతో బ్రతికేవాళ్ళం కాబట్టి మౌనం వహిస్తున్నాం. జనసేన పార్టీ పెట్టింది ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, వారి భవిష్యత్తు కోసం.. మేము ఎప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నాం. మేము కచ్చితంగా విలువలు పాటిస్తాం. అసలు ముఖ్యమంత్రికి ఏమి తేలేదు అనుకుందాం.. కనీసం ఆయన ఏ పేపర్ అయితే చూసి చదువుతున్నాడో ఆ పేపర్లో స్క్రిప్ట్ రాసిన వాడికి అయినా ఇంగిత జ్ఞానం ఉందా? ఒక ముఖ్యమంత్రికి స్క్రిప్ట్ రాస్తున్నాను.. ఆయన్ని దేశం మొత్తం చూస్తుంది అనే విషయం కూడా మర్చిపోయి రాస్తున్నాడు. గుంటూరు జిల్లా పేరిచర్ల సుమారు 418 ఎకరాల్లో 18 వేల పట్టాలు ఇచ్చారు. కానీ నిర్మాణం పూర్తయిన ఇల్లు కనీసం 18 కూడా లేవు. పత్రికా సమావేశంలో పాల్గొన్నవారు జిల్లా ఉపాధ్యక్షులుఅడపా మాణిక్యాలరావు రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజిని జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్ మధులాల్ నెల్లూరు రాజేష్ తన్నీరు గంగరాజు చింతకాయల శివ తదితరులు పాల్గొన్నారు.