రోడ్ల దుస్థితి పై జనసేన పోరాటం

*3 వ రోజు #GoodMorningCMSir

*శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, పాలకొండ మండలం నుంచి రాజాం వెళ్లే రహదారి దుస్థితి

పాలకొండ నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పాలకొండ నియోజకవర్గం గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాస్ ట్యాగ్ తో ముఖ్యమంత్రి కి తెలిసేలా ఆధ్వనంగా ఉన్న పాలకొండ-రాజాం మరియు లుంబూరు-పాలకొండ గుంతల రోడ్లు వద్ద డిజిటల్ క్యాంపైన్ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా నెతి కీ రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉన్నా పట్టించుకోకుండా గాఢ నిద్రలో ఉన్న సీఎం నిద్ర వీడి ప్రజల సొమ్మును పథకాలు పేరిట దుర్వినియోగం చెయ్యకుండా ఇకనైనా అభివృద్ధి చేయ్యాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేయడం జరిగింది.