ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన గాదె

గుంటూరు జిల్లా జనసేనపార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు సోమవారం జరిగిన రైతు భరోసా సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. సోమవారం జరిగిన రైతు భరోసా సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.