హనుమాన్, అయ్యప్ప భక్తుల అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న గాదె

గుంటూరు: ఏటుకూరు బైపాస్ నందుగల అభయ ఆంజనేయస్వామి గుడి నందు శనివారం మాలలు ధరించిన హనుమాన్ భక్తులకు, అయ్యప్ప భక్తులకు మరియు అమ్మవారి భక్తులకు ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. ఈ సందర్బంగా గాదె మాట్లాడుతూ ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం 45 రోజుల పాటూ ఏర్పాటు చేయటం చాలా ఆనందకరం, అలాగే ఈ రోజు 500 వందల మందికి సద్ది ఏర్పాటు చేసిన ముసలా గోపికి మరియు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న గుడి ధర్మకర్తలకు, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నారదాసు రామచంద్ర ప్రసాద్, సతీష్, త్రినాథ్, తుమ్మల నరసింహ, బీసబత్తిన సాయి, తుమ్మల హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *