ఆడపూర్ వీరమహిళ కుటుంబానికి అండగా టీం నందలూరు జనసేన

కడపజిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం ఆడపూర్ లో పంచాయతి ఎన్నికలకు సర్పంచ్ గా జనసేన పార్టీ తరపున పోటీ చేసిన వీరమహిళ కొడుకుకి ఆరోగ్యం బాగలేక ఆపరేషన్ ఖర్చులకి ఇబ్బంది పడుతున్నారని మస్తాన్ రాయల్ టీం నందలూరు జనసేన నాయకులు గురివిగారి వాసుకి తెలియజేయడంతో వెంటనే వెళ్ళి స్వయంగా వారి సమస్య కనుక్కొని డబ్బులు దాతల సహాయం, టీం నందలూరు జనసేన నాయకుల సహాయంతో తొలి విడతగా 12వేలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇచ్చిన దాతలకి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆడపూర్ శ్రీకాంత్, అనీల్, లక్ష్మి నారాయణ, మండెం రాము, టంగుటూరు ఈశ్వర్, కళ్యాణ్, అరుణ్ పాండ్య, ఎర్రిపాపల్లిసుబ్బు, నాగఆర్య, నందూ, నందిమాయపల్లి ప్రశాంత్, కుమ్మరపల్లి సాయి, ప్రకాష్, తిప్పాయపల్లి ప్రశాంత్, మంకు వెంకటేశ్ మరియు ఉపేంద్ర పాల్గొన్నారు.