అంగన్వాడీల, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు గజపతినగర జనసేన మద్దతు

  • న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి
  • సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడిల, ఉద్యోగుల సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి
  • సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి
  • 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాట్యూటీ కల్పించాలి
  • మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలి

గజపతినగరం: అంగన్వాడీల సమ్మెకు గజపతినగరం జనసేనపార్టీ సమన్వయకర్త మర్రాపు సురేష్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి, ఉద్యోగులకు అండగా జనసేన పార్టీ నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శిలు బాబు పాలూరి, జనసైనికులు పాల్గొనడం జరిగింది అంగన్వాడీ, సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.