మడ్డువలస కాలువ సాగునీరు విడుదల కోసం గళమెత్తిన వడ్డిపిల్లి శ్రీనువాసరావు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మరియు జి.సిగడాం మండలంలోగల చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు మడ్డువలస గ్రామం వరకు కాలువ ద్వారా నీరు 5నుండి6సంవత్సరాలవరకు నీరు వచ్చే దాఖలా లేదు. వైసిపి వచ్చి నీరు ఇచ్చే ఆలోచనలో లేదు. ఇటేవల జిల్లా కలెక్టర్ ఆఫీసులో స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ దగ్గరకి రైతులు వెళ్ళడం జరిగింది. రైతులు మడ్డువలస కాలువ ద్వారా నీరు రాలేదని కలెక్టర్ ను అడగడం జరిగింది. కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ ఏ.ఈని, డి.ఈని, జె.ఈని, దేవరవలస గ్రామం మరియు గుర్రలపాలేం వరకు పర్యవేక్షణ కోసం రావడం జరిగింది.. ఈ.ఓ స్పందించి మీరు ఎంపీడీఓ ని కలవండి అని డి ఓ చెప్పడం జరిగింది. భూమి పని చేసుకుంటే నీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. ఇటేవల ఎంపీడీఓ ని కలవడానికి వెళతామని శ్రీనువాసరావు చెప్పారు. ఈ విజయం జనసేన విజయమని ప్రజలు చెప్పారు. ఈ కార్యక్రమంలో గోవిందపురం పంచాయతీ జనసేన పార్టీ యంపిటీసి అభ్యర్థి అదపాక అప్పలరాజు, కృష్ణాపురం పంచాయతీ జనసేన పార్టీ యంపిటీసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, స్ధానిక రైతులు ఆల్తి సత్యనారయణ, సువ్వల రాంబాబు, ఈశర్ల ప్రకాషరావు, లేవగానే తవుడు, బీరికట్ల వెంకటరమణ, ఈశర్ల శ్రీనువాసరావు, తదితరులు పాల్గొన్నారు.