జనసేనతోనే నెల్లిమర్ల నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి

నెల్లిమర్ల నియోజకవర్గం: వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీని, తననూ ఆదరించాలని నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి లోకం మాధవి ప్రజలను అభ్యర్ధించారు. నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ, ఎస్సీ కాలనీలో ఇంటిఇంటికి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకం మాధవి గారు మాట్లాడుతూ మండల హెడ్ క్వార్టర్స్ పిలవబడుతున్న ఈ ప్రాంతం చాలా వెనకబడి ఉంది అని కనీస మౌలిక సదుపాయాలు కరువు అయ్యాయని ఎద్దేవా చేశారు. అలాగే పథకాల ధృవీకరణ లోనూ సమస్య వస్తోంది అని అక్కడి ప్రజలు విన్నవించుకున్నారు. వచ్చే ఎన్నికలలో తనకు పట్టం కడితే సుస్థిర పాలన అందిస్తామని చెప్పారు. నెల్లిమర్ల నియోకవర్గంలోని యువతకు ఉద్యోగ కల్పన చేయడంతో పాటు, సంక్షేమానికి కూడా పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. అవినీతి రహిత పాలన జనసేనకే సాధ్యమన్నారు.