ఏపీలో జోరుగా కోడిపందాలు !

రెండో రోజు కూడా ఏపీ వ్యాప్తంగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. రెండు రోజు కూడా 50 కోట్ల రూపాయలు మేరకు చేతులు మారాయి. గతంతో పోల్చితే కోడిపందాల శిబిరాలు వద్ద పందెం రాయుళ్లు సందడి తగ్గింది. గుండాటల శిబిరాల వద్ద మాత్రం సందడి పెరిగింది. సంక్రాంతి సంబరాలలో భాగంగా కోడి పందేలు, గుండాటలు, పేకాటలు, రెండు రోజులుగా హోరెత్తిపోతున్నాయి.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రేక్షకులతో ఆయా పందెం బరుల ప్రాంగణాలు కిటకిటలాడాయి. జాతరలను తలపించే రీతిలో బరులు ఉన్నాయి. నోట్ల కట్టలు ప్రవాహంలా చేతులు మారుతున్నాయి. కోడి పందేల బరులు కొన్నిచోట్ల వెలవెలబోయినప్పటికీ గుండాట బరులు మాత్రం జూదరులతో కిటకిటలాడాయి. 500 రూపాయాలు తక్కువ కాకుండా బెట్టింగ్‌ వేయాలని నిర్వాహకులు ఆంక్షలు విధించడంతో జూదరుల జేబులకు భారీగా చిల్లులు పడుతున్నాయి. రెండు రోజుల్లో రెండు మూడు వందల కోట్లపైనే లావాదేవీలు జరిగాయని అంటున్నారు.