బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన గంధం ఆనంద్

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్ రామ్ అని ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండా పవన్, యువజన విభాగం ఉపాధ్యక్షుడు అజయ్, ప్రధానర్యదర్శి కార్తీక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మణికంఠ, కార్యనిర్వహక సభ్యుడు పవన్ కళ్యాణ్, నాయకులు కార్తీక్, వినోద్, మాలిక్, శ్రీకాంత్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.