అక్రమ అరెస్టులను ఖండించిన గంధంశెట్టి దినకర్ బాబు

రైల్వే కోడూరు, జనసేన పార్టీ జనావాణి కార్యక్రమానికి హాజరు కావడం కోసం విశాఖపట్నం విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను, జనసేన పార్టీ సానుభూతిపరులను ప్రభుత్వం ఈ రకమైన చర్యలతో సతాయించడం క్షేమకరం కాదని రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు పేర్కొన్నారు. జనసేన పార్టీ నాయకుల పై సెక్షన్ 317 ప్రకారంగా కేసులు వేయడం చట్టరీత్యా కుదరదన్నారు. సెక్షన్ 30 నోటీసులు అధ్యక్షులు వారికి జారీ చేయడంలో వైసీపీ ప్రభుత్వం కుటిలనీతి అర్థమవుతుందన్నారు. ప్రభుత్వం స్వార్థపూరితంగా, ప్రభుత్వంలోని మంత్రులు, వైసీపీ నాయకులు కుట్రపూరితంగా జనసేన పైన చేస్తున్న రాజకీయ కుట్రలను రాష్ట్రంలోని ప్రజలంతా గమనిస్తున్నారు అని పేర్కొన్నారు. ఒకే కులం, ఒకే కుటుంబం చేతిలో కేంద్రీకృతం అయిన అధికారం కనీసం ఉపముఖ్యమంత్రులకూ మంత్రులకూ వికేంద్రీకరణ చేయండి. అప్పుడు వింటాం మీ వికేంద్రీకరణ మరియు ఉత్తరాంధ్ర రాజధాని అనే కబుర్లు అని తీవ్రంగా ఆక్షేపించారు. జనసేన పార్టీ నాయకులను భేషరతుగా విడుదల చేయాలని లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.