సత్తెనపల్లిలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు

సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల చిత్రపటాలకు పూలమాలవేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, దమ్మాలపాడు ఎంపీటీసీ సిరిగిరి రామారావు, పట్టణ నాయకులు రాడ్లు శ్రీనివాసరావు, రాజుపాలెం మండలం ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటస్వామి, దమ్మాలపాడు గ్రామ అధ్యక్షులు శివయ్య, ఐలం ఆదినారాయణ తిరుమల శెట్టి సాంబ, సూరం శెట్టి సతీష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.