గుంటూరు జనసేన కార్యాలయంలో గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుక

గుంటూరు, గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆదివారం జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి జయంతి వేడుకలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు, ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లికా, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, కొర్రపాటి నాగేశ్వరరావు, మధులాల్, దాసరి వెంకటేశ్వరరావు, కొత్తకోట ప్రసాద్, జానీ బాషా, మరి కొందరు జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.