జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

హైదరాబాద్, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ అధ్యక్షులు రాధారం రాజలింగం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళా చైర్మన్ కావ్య మండపాక, తెలంగాణా యువజన విభాగ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ మరియు పార్టీ ముఖ్య నాయకులు వీరమహిళలు, యువజన విభాగ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.