గాంధీ వర్ధంతి: మహాత్మునికి నివాళులర్పించిన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాలాలు వేసి నివాళులర్పించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా మలుచుకుని ఏదైనా సాధించవచ్చునని నిరూపించిన గొప్ప మహానీయులు గాంధీజీ గారు. స్వరాజ్య సాధనకు అహింస అనే ఆయుధాన్ని వాడి ప్రపంచానికి దాని ప్రాధాన్యతను తెలిసేలా చేసిన ధీశాలి మహాత్మా గాంధీ గారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ షాధిక్, మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, పూజ లక్ష్మీ, శిరిగిరి శ్రీనివాసులు, తిరుపతయ్య, బెల్లంకొండ రామక్రిష్ణ, ఖాజావలి, ఫణి, చందు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.